29, డిసెంబర్ 2013, ఆదివారం

దేవాదాసిలు 

పూర్వ రోజుల్లో  ఈ దేవదాసిలను కళావంతులు అని పిలిచెవారు.  1900 మొదట్లో సిరి సంపదల్లో  తులతూగే
 
 రాజులు  వినోదం కోసం అట్టడుగు వర్గాల్లో  అందమైన బాలికలని  ఆలయాలకు అర్పించే  దేవదాసి వ్యవస్థ  కి వాళ్ళే 
 
మూలకారకులు. 
 
రాజుల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతున్న కాలంలో  పోటా  పోటిగా  కట్టించిన ఆలయాల్లో నిత్య పూజలు,భజనల కోసం ఎంపిక చేసినవారే  ఈ దేవదాసిలు. వారి పని పూలుకట్టడం, గంధం పూయడం, దేవుని పాటలు పాడుతూ నృత్యం  చేయడం .  దేవుని పూజలకే  అంకితమయిన  వీళ్ళ పోషణ కోసం  మాన్యం భూముల్లో కొంత కెటాయించెవారు.  
పూర్తి దయవ చింతన కల ఈ  వృత్తి  లోకి బాలికలని పంపెందుకు  తల్లితండ్రులు ఆసక్తి చూపెవారు. 
 
ఇలానే కొనసాగితే దేవదాసీలు వేదపండితులుకున్న గౌరవం, గుర్తింపు ఉండేవి. 
 
బాలికలు అందచందాలు పాలకులలో నీచ బుద్దిని పెంచాయి. ఫలితం గా దేవుని సేవకులు కాస్తా రాజనర్తకి లు గా మారారు. వీల్లె కళావంతులు గా స్తిరపడ్డారు. 
 
కొన్నేళ తరువాత రాజీలు పోయి జమిందారి వ్యవస్థ వచ్చింది. వీళ్ళ జీవితలో కూడా మార్పు వచ్చింది. అప్పటిలో రాజులూ కోసం చేసేదంతా జమిన్దరులకి చెయ్యడం మొదలియింది. 
 
సామాన్య జనానికి కళావంతులని చూడటం అందని ద్రాక్షా తరువాత తరువాత జమిన్దరిలు వాళ్ళ ఇళ్ళలో జరిగే శుభాకార్యలకి వీరితో ప్రదర్శన ఎప్పించెవరు. ఆరోజులో అదొక స్టేటశ్ సింబల్ . 
 
వీటిని మేజువాణిలు అనంటారు. ఈ దశ లోనే వీళ్ళు బాగా దిగజారిపొయరు. బ్రిటిష్ పాలనా లో రోడ్ న పడిన వాళ్ళలో వీళ్ళు ఒకరు. అదెలాగంటే బ్రిటిష్ ప్రభుత్వం  మేజువాణి లను నిషేదించింది. 
దీనివలన  వీలంత నాటకాలు,రికార్డింగ్ డాన్సు, పడుపు వృత్తి  లో కి  వెళ్ళిపోయారు.  కొందరు సినిమాల్లో కూడా నటించి గొప్ప నటీమణులు గా పేరు తెచ్చుకున్నారు . 
 
దేవాలయలో పవిత్రంగా మొదలైనది చివరికి ఎంతగానో దిగజారి పడుపు వృతి లోకి మారిపోఇమ్ది . 
 పడుపు వృతి  వలన HIV  ల బారిన పడుతున్నారు చాలమంది వున్నారు . స్వచ్చంద సంస్తలు వీళ్ళకి కొంతవరకి సహయపడుతున్నాయి.ప్రభుత్వాలు  కూడా వీల్లకి  కుటీరా  పరిశ్రమలు ద్వార  పనులు నేర్పించి  వాళ్ళకి వాళ్ళు గ సంపదిన్చుకునేలే  చేస్తే ఆర్ధికం గ వేసులుపాటు వుంటే అ వృతి నుండి బయటకి వచ్చి గౌరవంగా జీవిస్తారు . 
 
మహిళలు అన్ని రంగాలలో ముందుకుపోతున్న ఇంకా సమాజంలో కొంతమంది మహిళ ల జీవితాలు దుర్బరంగా నే వున్నాయి  అని చెప్పడానికి నిదర్శనం ఈ దేవదాసీలు . 
 
 
 
 
 

21, డిసెంబర్ 2013, శనివారం

Aathma Bandhuvu - Manishiko Sneham Song



ముదల్ మరియాదై అను తమిళ్ సినిమా భారతి రాజా గారి అద్బుత సృష్టి. తమిళ్ లో శివాజీ గణేషన్  గారు రాధా గారు చెసారు. తెలుగు లో ఆత్మ భన్దువు గా వచ్చింది . నిజంగానే ప్రతి మనిషికి ఒక స్నేహం కావాలి . ఆ నీడలో ఆనందాలని బాధలని పంచుకొంటే దాహం తీరినట్లుంటది . అ స్నేహం ఏవరిన్  కావాచ్చు. స్నేహానికి వయసుతో లింగబేదం తో పనిలెదుకద.



15, డిసెంబర్ 2013, ఆదివారం


చారులత బెంగాలీ సినిమా - సత్య జిత్ రీ

  భారతీయ నవ్య సినిమాకి నిలువెత్తు రూపమైన సత్యజిత్ రే తన జీవితకాలంలో నిర్మించిన ముప్పైకి పైగా చలన చిత్రాల్లో అత్యంత భావావేశంతో కూడుకున్న చిత్రం “చారులత”. ఆ చిత్రంలో అత్యంత వివేకమూ, అమితమయిన సున్నితత్వమూ, తనపైన తనకు గాఢమైన విశ్వాసమూ కలిగిన అందమయిన స్త్రీ చారులత ముఖ్యాభినేత. ఆమె తన జీవితంలో ఎదిగిన తీరూ, అనుభవించిన ఒంటరితనమూ, తన అభీష్టాలను నెరవేర్చుకునే క్రమంలో ఆమె ముందుకు సాగిన వైనమూ ఈ చిత్రంలో ప్రధానాంశాలు. తన కుటుంబ జీవన పరిస్థితుల్లో చారులత తాను ఓ వైపు గొప్ప ప్రేమనుపొందినట్టుగా ఫీలవుతుంది. సత్యజిత్ రే చారులత్ పాత్రని అత్యంత దగ్గరగా అధ్యయనం చేసి రూపొందించారు. ఆ పాత్ర మానసిక అంతర్లోకాల్లోకి ప్రవేశించి అర్ధం చేసుకుని మరీ ఈ చిత్రాన్ని రూపొందించినట్టుగా కనిపిస్తుంది. సారళ్యతకూ, కృత్రిమత్వానికి నడుమ కనిపించే అన్యోన్య ప్రభావం చారులతలో గొప్పగా ఆవిష్కృతమైంది. రే భావుకుడిగా అత్యున్నతమైన ప్రతిభను కనబర్చారు.

నిజానికి సత్యజిత్‌రే ఏనాడూ స్త్రీవాదాన్ని అధారం చేసుకొని ప్రత్యేక సినిమాలు నిర్మించలేదు. కాని ఆయన చిత్రాల్ని పరిశీలిస్తే మహిళల ఎదుగుదల యొక్క పరిణామక్రమం స్పష్టంగా గోచరిస్తుంది. అందుకే ఆయన చిత్రాల్లోని స్త్రీ పాత్రలు కేవలం రక్త మాంసాలున్న మనుషులుగా మాత్రమే కాకుండా మనసున్నవారు, ప్రేమాస్పదులూ, ఆశించిన ప్రేమను అందుకోగలిగే దృఢదీక్ష కలిగిన స్త్రీ పాత్రలే చిత్రాల్లొ మనకు కనిపిస్తాయి. ఆయన చిత్రాల్లో కెల్లా చారులత మరింతగా మహిళా దృక్పథంలో నిర్మించిన చిత్రం.

“చారులత” వర్తమాన కథా, కథన చిత్రం కాదు. అది పీరియడ్ ఫిల్మ్. 1879 కాలం నాటి బెంగాలీ కుటుంబ చిత్రీకరణ ఇందులో కనిపిస్తుంది. ఈ చిత్రం రవీంద్రనాధ్ ఠాగోర్ రచించిన కథ ఆధారంగా నిర్మితమయింది. 1958 ప్ రాంతంలో రే ఠాగోర్ జీవిత చారిత్రాత్మక చిత్రాన్ని గురించి పరిశోధన జరుపుతున్న కాలంలో ఠాగోర్ రచించిన ‘నాస్తనీర్’ అన్న లిఖిత ప్రతి కంపించింది. దాంట్లో ఠాగోర్ జీవితపు చాయలు కొన్ని కనిపించడంతో ఆ చిన్న నవలని తీసుకొని సత్యజిత్‌రే 1958 లోనే తన స్క్రిప్ట్ ను రాసుకున్నాడు. అయితే ఆ స్క్రిప్ట్ లోని ప్రధాన పాత్రకు సరిపడే నటి లభ్యం కాకపోవడంతో రెండు, మూడేళ్లు ఆ స్క్రిప్ట్ ని మూల పెట్టేశారు సత్యజిత్‌రే.

అయితే నటి మాధవీ ముఖర్జీ ఓ సంపూర్ణమయిన భారతీయ స్త్రీ చాయలు, లక్షణాలు, భారతీయ స్తీల భావాల్ని పలికించగలిగే ప్రతిభ కనిపించడంతో తిరిగి “చారులత’ ను నిర్మించాలనుకుని 1964 లో విడుదల చేశారు. చిత్ర కథాంశం విషయానికి వస్తే 1879 ఓ కలకత్తా నగరంలో ధనవంతుడయిన యువకుడు భూపతి దత్తా నివసిస్తూ ఉండేవాడు. ఆయన ‘సెంటినెల్’ అనే ఆంగ్ల రాజకీయ వారపత్రికకు సంపాదకీయ బాధ్యతలు నిర్వహిస్తూ, ప్రచురిస్తూ ఉంటాడు. ఆయన భార్య చారులత, అందమయిన ఆమె తన తీరిక కాలాన్ని అల్లిక పనిలో గడుపుతూ ఉంటుంది. దానికి తోడు బెంగాలీ సాహిత్యాన్ని ముఖ్యంగా నవలల్ని ఆమె అధ్యయనం చేస్తూ ఉంటుంది.

ఎప్పుడూ తన కార్యకలాపాల్లొ మునిగి తేలుతూ బిజీగా ఉండే భూపతి తన భార్య ఒంటరిగనాన్ని గమనిస్తాడు. చారులతకు తోడుగా ఉండడానికి తన పత్రిక వ్యవహారాల్లొ మేనేజిమెంట్ చేయడానికి గాను చారులత పెద్దన్నయ్య ఉమాపాదను, అతని భార్య మందాకినిని పిలిపిస్తాడు. కలకత్తాకు చేరుకున్న ఉమాపాద పత్రిక మేనేజర్ బాధ్యతలు స్వీకరించగా, మందాకిని ఇంటి వ్యవహారాల్లోకి వచ్చేస్తుంది. అయితే నిరక్షరాస్యురాలయిన మందాకిని చారులత జీవన వ్యవహారంపై ఎలాంటి ప్రభావాన్ని కలిగించలేకపోతుంది. చారులత ఎప్పటిలాగే తన పనుల్ని తాను చేసుకుపోతూ ఉంటుంది.

సరిగ్గా అదే సమయంలో భూపతికి వరసకి తమ్ముడయిన అమల్ తన సెలవుల్ని గడపడానికి వారి ఇంటికి వస్తాడు. అమల్ సాహిత్యాభిమాని . భూపతి సూచన మేరకు అమల్ తన వదిన చారులతతో సాహిత్య చర్చకు పూనుకుంటాడు. ఆమె సాహిత్యాధ్యయనానికి మరింతగా తోడ్పడతాడు అమల్. వారిద్దరి నడుమ సాన్నిహిత్యం పెరుగుతుంది. అసంకల్పితంగా చారుని అమల్ వ్యక్తిత్వం ఆకర్షింపచేస్తుంది. ఆమె అమల్ ప్రభావంలో పడిపోతుంది. తన పనిలో నిమగ్నమయి ఉండే భూపతికి ఈ విషయాలేవీ తెలీవు, పట్టవు కూడా.

రే  ఎంత సున్నితం గ చారులత అమల్  ల మధ్య సాన్నిహిత్యం ఉండేలా చుపించాడంటే  సినిమా చూస్తున్న ప్రేక్షకుడి కి కూడా అర్ధం అవ్వదు  సినిమా చివరిలో నే అర్ధం అవుతుంది.

ఈలోగా ఉమాపద భూపతి పత్రికాఫీసులో పలు అవకతవకలకు పాల్పడ్డంతో పాటు తనకి అందుబాటులో ఉన్న డబ్బుతో పారిపోతాడు. అది తెలిసిన భూపతి జరిగిన మోసాన్ని తనకు ఆప్తుడయిన అమల్‌కి చెబుతాడు. కాని వదిన విషయంలో భూపతిని తాను కూడా మోసం చేసానేమోనన్న భావం పీడించగా భూపతిని కష్టపెట్టడం ఇష్టం లేక ఓ చిన్న ఉత్తరం రాసిపెట్టి అదే రాత్రి వెళ్లిపోతాడు అమల్. తెల్లారింతర్వాత చారులత తీవ్ర నిరాశకు గురౌతుంది.
తర్వాత సెలవులు గడిపేందుకు కొంతకాలం భర్తతో బయటకు వెళ్లొచ్చిన చారులత తన భావావేశాల్ని అదుపులోకి తెచ్చుకుంటుంది. కాని కలకత్తాకు తిరిగి రాగానే అమల్ రాసిన ఉత్తరం ఆమెలో గతస్మృతుల్ని లేపుతుంది. తన వెనకాల్నే భర్త ఉన్నాడన్న విషయం గమనించకుండానే చారులత దుఃఖాన్ని నిలువరించలేక పోతుంది. భూపతి మౌనంగా ఇంట్లోంచి బయటకు వెళ్లిపోతాడు. కొంగ సేపటికి తిరిగి వచ్చిన భూపతికి దుఃఖంలోంచి తెప్పరిల్లిన చారులత చేయి సాచి ఇంట్లోకి ఆహ్వానించే చిట్టచివరి ఫ్రీజింగ్ షాట్‌లో చిత్రాన్ని ముగిస్తాడు రే. అయితే ఈ ముగింపు ఠాగోర్ తన కథకి చూపించిన ముగింపుకు భిన్నమయినది.

మూలకథ చివర్లో బయటకు వెళ్లిన భూపతి తిరిగి వచ్చి చారులతని తనతోపాటు తీసుకెళ్లడానికి ముందుకు వస్తాడు. కాని చారులత అందుకు అంగీకరించదు. వారి బంధం తెగిపోతుంది. కాని సత్యజిత్ రే సినిమా విషయం వచ్చేసరికి వారిద్దరిని కలుపుతాడు. ఆనాటి వర్తమాన మధ్య తరగతి మానసిక స్థితిని పరిగణించో లేదా విస్తృత కళాత్మక రూపమయిన సినిమా మాధ్యమాన్ని దృష్టిలో ఉంచుకునో ఫ్రీజింగ్ షాట్స్ లో వారి కలయికను చూపిస్తూ చిత్రాన్ని ముగించాడు.

మొత్తం మీద స్త్రీ కోణంలోంచి స్త్రీల మేధా పరిపక్వతను, మానసిక వికాసాల్ని అత్యంత ప్రతిభా వంతమయిన చలన చిత్ర రూపంలోకి అనువదించిన సత్యజిత్ రే అత్యంత కళత్మకమైన సృష్టి ‘చారులత’
స్క్రిప్ట్, సంగీతం, దర్శకత్వం – సత్యజిత్ రే.

ఆనంద్ వారాల పుస్తకం ’సినీ సుమాలు’ నుంచి ఈ వ్యాసాన్ని సేకరించి తెలుగు యూనికోడ్ లోకి మార్చినందుకు జ్యోతి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు